![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -969 లో....ధరణి చెయ్యి లాక్కొని శైలేంద్ర ఇంట్లోకి వస్తాడు. ఏమైంది నన్ను లాక్కొని వస్తున్నారని ధరణి అడుగుతుంది. అసలు నువ్వు బాబాయ్ ఇంటికి ఎందుకు వెళదామని అనుకున్నావని అడుగుతాడు. రిషి గురించి వెళ్ళానని ధరణి చెప్పగానే రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని శైలేంద్ర అడుగుతాడు.
రిషి ఎక్కడ ఉన్నాడోనని నాకెలా తెలుస్తుంది. మావయ్య గారిని అడిగి తెలుసుకుందామనుకున్నానని ధరణి అంటుంది.. శైలేంద్ర చిరాకు పడుతు ఉంటాడు. శైలేంద్ర చూడకుండా ధరణి ఫోన్ లో రికార్డర్ ఆన్ చేసి దూరంగా ఉంచుతుంది. అది తెలియని మన వెంగళప్ప శైలెంద్ర తన తప్పులు చేసిన కుట్రలు అన్ని ధరణి చెప్తుంటే శైలేంద్ర సైలెంట్ గా ఉంటాడు. మీరు ఎండీ సీట్ మీద ఆశతో రిషిపై ఎన్ని ఎటాక్ లు చేయించారు. మీ గురించి ఒక మావయ్యకి తప్ప అందరికి తెలుసని ధరణి అనగానే.. శైలేంద్ర ధరణిపై కోప్పడతాడు. ఆ తర్వాత ఈ వీడియోని అవసరం వచ్చినప్పుడు వాడతానని ధరణి అనుకుంటుంది. మరొకవైపు రిషి వసుధార ఇద్దరు బయటకు వెళ్తారు. సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే కార్ లో జగతి మేడమ్ రాసిన లెటర్స్ కిందకి పడతాయి. ఇవి అప్పుడు పాండియన్ తీసుకొని వచ్చినవి కదా ఇంత వరకు చదవలేదు.. టైమ్ ఉన్నప్పుడు చదువుతానని రిషి అంటాడు.
మరొక వైపు రౌడీలు శైలేంద్రని తీసుకొని రిషిని కాపాడిన ముసలి వాళ్ళ ఇంటికి వస్తాడు. నువ్వు వెళ్ళు అని రౌడీలని శైలేంద్ర పంపిస్తాడు. నేను వస్తాను సర్ అని రౌడీ అనగానే.. అడ్రస్ చెప్పడం వరకే నీ పని అ తర్వాత అంత నేను చూసుకుంటానని ఆ రౌడీని పంపించి శైలేంద్ర ఒక్కడే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి ముసలివాళ్లని కలుస్తాడు. ఎవరు మీరు అని వాళ్ళు అనగానే.. నాకు వైద్యం చెయ్యాలి నడుము నొప్పిగా ఉంటుందని శైలేంద్ర అనగానే శైలేంద్రపై ముసలి వాళ్ళకి డౌట్ వస్తుంది. దాంతో అతనికి వైద్యం పేరిట కాషాయం తాగిస్తారు. నడుము నొప్పికి మంచి వైద్యం అంటూ శైలేంద్రని పడుకోబెట్టి కర్రతో నడుముపై ఆ ముసలాయన వాయిస్తుంటాడు. ఆ సమయంలో శైలేంద్ర పడ్డ బాధగా కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |